“జనం కోసం జనసేన” మహా పాదయాత్ర – ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం

జనం కోసం జనసేన

      రాజానగరం ( జనస్వరం ) : రాజానగరం మండలం, ముక్కినాడ పాకలు గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు,  బత్తుల వెంకటలక్ష్మి  పర్యటించారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు వైవరించారు. ఆడపడుచులకు బొట్టు పెట్టి “గాజు గ్లాసు” గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేనపార్టీని ఆధికారంలోకి తీసుకురావడమే అధికార లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అధికారాన్ని ఇచ్చి చూడాలని సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల సీనియర్ జనసేన నాయకులు, జనసైనికులు, ముక్కినాడ పాకలు గ్రామ వాసులు పాల్గొన్నారు.

See also  ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని పదవులు ఎందుకు : రేఖగౌడ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి