నెల్లిమర్ల జనసేన నాయకురాలు లోకం మాధవి ఆధ్వర్యంలో చింతపల్లిలో మన ఊరిలో జన వారధి

లోకం మాధవి

         నెల్లిమర్ల ( జనస్వరం ) : ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే మన ఊరిలో జన వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జనసేన నియోజకవర్గ నాయకురాలు లోకం నాగమాధవి తెలిపారు. మండలంలోని చింతపల్లిలో జనసేన ఆధ్వర్యంలో మన ఊరిలో జనవారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార మహిళలు తమ గోడును ఆమె ముందు వినిపించారు. జెట్టీ నిర్మిస్తే వలసలను నివారించవచ్చని తెలిపారు. 2019లో అగ్నిప్రమాదంలో 25 ఇళ్లు కాలి బూడిదయ్యాయని, ఇంతవరకూ పరిహారం అందలేదని బాధితులు వాపోయారు. అనంతరం ఆమె స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు జమ్మరాజు, కారి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

See also  ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మానవత్వం చాటుకున్న కొత్తపేట ఇంచార్జ్ బండారు శ్రీనివాస్