
విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లాలో జనసేన నియోజకవర్గాల సమీక్షలు ఈమధ్యనే తాటిపూడిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమయంలో గుంకలాం జనసైనుకులు నాదెండ్ల మనోహర్ కు వికలాంగుడైన గుంకలాం గ్రామస్తుడు కునుకు నారాయణప్పడు త్రిచక్ర వాహనం లేక పడుతున్న అవస్థలను చెప్పగా, వెంటనే మనోహర్ స్పందించి, పక్కనే అందుబాటులో ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలు లోకం మాధవి కు కొంచెం చూడమ్మా అనికోరగా వెంటనే లోకం మాధవి స్పందించి గుంకలాంలో ఉన్న కునుకు నారాయణప్పడుకు త్రిచక్ర వాహనంతో పాటు, నెలరోజులు సరిపడా కిరాణా సరుకులను, నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులతో శుక్రవారం పంపించి, ఆమె తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఈ సహాయాన్ని పొందిన కునుకు నారాయణప్పడు కుటుంబ సభ్యులతో పాటు, గుంకలాం జనసేన యువనాయకులు బోగి సాయి, ఎల్లపు రామకృష్ణ, కంది సత్తి బాబు, జానీ, రాజు, తదితరులతో పాటు గ్రామస్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ లోకం మాధవికు కృతజ్ఞతలు తెలిపారు.