గిరిజన గ్రామాల్లో లేని ఆర్టీసీ బస్సులు, టూరిస్టులకు ప్రత్యేక బస్సులు ఎందుకు : జనసేన నాయకులు మాదాల శ్రీరాములు

గిరిజన

          అరకు ( జనస్వరం ) : టూరిస్టు బస్సుకి “గిరిగ్రామ దర్శిని” పేరు  ఎందుకు ? గిరిజనులకు గిరిజన గ్రామాల్లో ఆర్టీసీ బస్సు వేశారా అంటూ జనసేనపార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో బస్సులు లేక ప్రైవేటు వాహనాల్లో ఆధారపడుతున్న గిరిజనులు లోతేరు, బస్కి గుంట, సీమా, సోవ్వ లాంటి ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గిరిజనులు అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న స్పందించే నాధుడే లేడు. టూరిజం ద్వారా కోట్లు రూపాయలు ఆదాయం వస్తున్న గిరిజన ప్రాంతాల్లో టూరిస్టులు తిరిగే ప్రాంతాల్లో రోడ్లు బాగుచేయరు టూరిజం వల్ల వచ్చే ఆదాయం పంచాయితీ అభివృద్ధికి టూరిజం ఏటా ఎంత ఇస్తుందని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో ఏటా కోట్ల రూపాయలు వస్తుంది. టూరిజం పేరుతో రోజు ఎన్నో బస్సులు నడిపిస్తున్నారు ఈ బస్సు గిరి గ్రామ దర్శిని అంటూ టూరిస్టులు కోసం ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నారు టూరిస్టులకు బస్సు పెట్టి అన్ని చూపిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో బస్సు సౌకర్యం ఎందుకు కల్పించట్లేదు ?? టూరిస్టులు మీద ఉన్న ప్రేమ గిరిజనుల మీదా లేదా అని అన్నారు. గిరిజనులు ప్రైవేటు వాహనాలే దిక్కు…  ముందు గిరిజన ప్రాంతాల్లో బస్సు సౌకర్యం కల్పించండి. టూరిజంలో వచ్చే ఆదాయం పంచాయితీలకు ఖర్చుపెట్టండి. టూరిస్టుల కోసం బస్సులు, లాడ్జి హోటల్ లు కడితే వాళ్లకు మాత్రమే ఉపయోగం. గిరిజన గ్రామాల్లో అభివృద్ధికి బస్సు సౌకర్యం కల్పించడానికి అధికారులు కృషి చేయాలి అంటూ మాదాల శ్రీరాములు డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way