Logo
Date of Publish : 16 September 2022, 3:45 pm
Editor : Sake Naresh

గిరిజన గ్రామాల్లో లేని ఆర్టీసీ బస్సులు, టూరిస్టులకు ప్రత్యేక బస్సులు ఎందుకు : జనసేన నాయకులు మాదాల శ్రీరాములు

          అరకు ( జనస్వరం ) : టూరిస్టు బస్సుకి "గిరిగ్రామ దర్శిని" పేరు  ఎందుకు ? గిరిజనులకు గిరిజన గ్రామాల్లో ఆర్టీసీ బస్సు వేశారా అంటూ జనసేనపార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో బస్సులు లేక ప్రైవేటు వాహనాల్లో ఆధారపడుతున్న గిరిజనులు లోతేరు, బస్కి గుంట, సీమా, సోవ్వ లాంటి ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గిరిజనులు అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న స్పందించే నాధుడే లేడు. టూరిజం ద్వారా కోట్లు రూపాయలు ఆదాయం వస్తున్న గిరిజన ప్రాంతాల్లో టూరిస్టులు తిరిగే ప్రాంతాల్లో రోడ్లు బాగుచేయరు టూరిజం వల్ల వచ్చే ఆదాయం పంచాయితీ అభివృద్ధికి టూరిజం ఏటా ఎంత ఇస్తుందని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో ఏటా కోట్ల రూపాయలు వస్తుంది. టూరిజం పేరుతో రోజు ఎన్నో బస్సులు నడిపిస్తున్నారు ఈ బస్సు గిరి గ్రామ దర్శిని అంటూ టూరిస్టులు కోసం ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నారు టూరిస్టులకు బస్సు పెట్టి అన్ని చూపిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో బస్సు సౌకర్యం ఎందుకు కల్పించట్లేదు ?? టూరిస్టులు మీద ఉన్న ప్రేమ గిరిజనుల మీదా లేదా అని అన్నారు. గిరిజనులు ప్రైవేటు వాహనాలే దిక్కు...  ముందు గిరిజన ప్రాంతాల్లో బస్సు సౌకర్యం కల్పించండి. టూరిజంలో వచ్చే ఆదాయం పంచాయితీలకు ఖర్చుపెట్టండి. టూరిస్టుల కోసం బస్సులు, లాడ్జి హోటల్ లు కడితే వాళ్లకు మాత్రమే ఉపయోగం. గిరిజన గ్రామాల్లో అభివృద్ధికి బస్సు సౌకర్యం కల్పించడానికి అధికారులు కృషి చేయాలి అంటూ మాదాల శ్రీరాములు డిమాండ్ చేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com