Search
Close this search box.
Search
Close this search box.

డొనేషన్లు ఇస్తానంటే మూలవిరాట్ ను కూడా తీసుకువెళ్తారా? జనసేనపార్టీ అమ్మవారి ధార్మిక సేవా మండలి

● ఇది దేవాదాయ శాఖ? లేక దోచుకునే శాఖ ?
       విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో అమ్మవారి ధార్మిక సేవా మండలి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అమ్మవారి ధార్మిక సేవా మండలి సభ్యులు నారం శెట్టి కూర్మారావ్ మాట్లాడుతూ కొద్ది రోజులుగా చూస్తున్న దేవాదాయ శాఖలో అనగా దారుణాలు జరుగుతున్నాయని, అమ్మవారి గుడిలో ప్రధాన అర్చకులు అమ్మ వారి ఆభరణాలు తీసుకొని అమెరికా వెళ్లి అక్కడ పూజా కార్యక్రమలు నిర్వహించి అక్కడ డొనేషన్ లు కలెక్ట్ చేశారని, డొనేషన్ లు ఇస్తానంటే మూలవిరాట్ ను కూడా తీసుకువెళ్తారా అని? డొనేషన్ లుగా వచ్చిన డబ్బులు అమ్మ వారి ఖాతాలో ఎందుకు జమ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి జేబులోకి వెళ్లాయో ఈఓ, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమాధానం చెప్పాలని, గత మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి, మంత్రి కొట్టు సత్యనారాయణకి పెద్ద తేడా ఏమీ లేదని, ఆయనలాగే ఈయన అక్రమాలను, అరాచాకలను ప్రోత్సహిస్తున్నారని, గతంలో జరిగిన మూడు సింహాల దొంగలను ఎందుకు పట్టుకోవటం లేదని, వారిపైన అంత ప్రేమ ఎందుకో కొత్త మంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. అనంతరం సభ్యురాలు నిట్ల ఉమామహేశ్వరి మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గత దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మూడు సింహాలు పోయాయని, అలాగే అమ్మవారి గుడిలో ఎన్నో దారుణాలు జరిగాయని, ప్రస్తుతం మంత్రి కొట్టా సత్యనారాయణ హయాంలో కూడా అమ్మవారి గుడిపై దారుణాలు జరుగుతున్నాయని, అసలు అమ్మవారు నగలను విదేశాలు ఎందుకు పంపించారో సమాధానం చెప్పాలని, అమ్మవారి నగలను సముద్రాల దాటించే సముద్రాలు దాటించడం అంటే భక్తుల మనోభావాలతో ఆడ్డుకోవడమేనని, అమ్మవారి నగలు విదేశాలు తీసుకెళ్లడంలో ప్రధానార్చకులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారని విదేశాలలో సుమారుగా రెండు లక్షల డాలర్లు వచ్చాయని, ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు కోటిన రూపాయలు అని, ఈ మొత్తం విరాళాలు దారి మళ్లించారని, అమ్మ వారి ఖాతాలో విరాళాలు జమ కాలేదని, విరాళాలలో ఎవరి వాటా ఎంతో దేవాదాయ శాఖ మంత్రి, ఈవో సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం మంత్రి గతంలో జరిగిన మూడు సింహాల ఘటనపై దొంగల్ని పట్టుకోవాలని, గతంలో దేవాదాయ శాఖలో, అమ్మవారి గుడిలో జరిగిన అవకతవకల పైన దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మరొక సభ్యురాలు శానంపూడి బి ఎల్ కె శిరీష మాట్లాడుతూ అమ్మవారి దేవాలయాన్ని అక్రమాలకు నిలయంగా మార్చేస్తున్నారని, అమ్మవారిని ప్రతిష్టను దిగజారుస్తున్నారని, ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ దేవదాయ శాఖ లాగా లేదని దోచుకునే శాఖ లాగా మారిపోయిందని, ప్రభుత్వంలో పాలయాలపై దాడులు, దారుణాలు తప్ప అభివృద్ధి లేదని, మూడు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం దేవాలయాలపై దాడి చేసిన వ్యక్తులపై ఒక్కరంటే ఒక్కరిపైనైనా చర్యలు తీసుకోలేదని, ఈ ప్రభుత్వంలో దేవాలయాలకు రక్షణ కొరవైందని, మంత్రులు మారుతున్నారు కానీ దేవాలయాలు అభివృద్ధి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సంఘటనలు పైన ప్రస్తుతం జరుగుతున్న సంఘటన పైన మంత్రి కొట్టు సత్యనారాయణ తగు చర్యలు తీసుకోకపోతే గత మంత్రి లాగే మీరు కూడా అసమర్థమంత్రిగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో అమ్మవారి ధార్మిక సేవా మండలి సభ్యులు బుద్ధానప్రసాద్, రేవడి రమాదేవి, అడ్డగిరి పుల్లారావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way