ఆత్మకూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మైనార్టీ ముస్లింలకు మోసం చేసిందని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ పత్రిక విలేకరులతో మాట్లాడుతూ దులహన్ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ప్రభుత్వ అధికారులు హైకోర్టుకు చెప్పడం జరిగింది. జగన్ రెడ్డి చేతకానీ పరిపాలనకు నిదర్శనమని మస్తాన్ మండిపడ్డారు. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడున్న టిడిపి ప్రభుత్వం ముస్లింలకు దులహన్ పథకం కింద 50 వేలు ఇస్తే 2019లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష రూపాయలు దులహన్ పథకం కింద ముస్లిం మైనార్టీలకు ఇస్తాను అని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా దగ్గర దుల్హన్ డబ్బులు ఇవ్వలేను అని చెప్పడం సరికాదని 90 శాతం ముస్లిం ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మాట తప్పడం మడమ తిప్పడం అనడానికి నిదర్శనం. మూడు సంవత్సరాలు పూర్తయి పథకం తీసేయడం ముస్లింలకు అవమానించడం అని తెలియజేశారు. అదేవిధంగా యువత ఉపాధి స్థిరపడేందుకు స్వయం ఉపాధి కింద ఐదు లక్షలు ఇస్తాను అన్నారు. ఇంకా ముస్లిం మసీద్ మౌసన్లకు ఇమామ్లకు గౌరవ వేతనం కింద పదిహేను వేలు ఇస్తాను అన్నారు. ముస్లింస్ మైనార్టీలో ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్ష రూపాయలు ఇస్తానన్నారు. హజ్ యాత్రకు యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. ఎన్ని హామీలు ఇచ్చి ఏది కూడా ముస్లిం మైనార్టీలకు ఇవ్వకపోవడం వైసీపీ ప్రభుత్వం చేతకాని అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.