పాలకొండ, (జనస్వరం) : మన్యం పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో ప్రజల ఆరోగ్య దృష్ట్యా డెంగ్యూ, మలేరియా, వ్యాధులు ప్రబలకుండా ప్రాంతాల్లో పాలకొండ నగరంలో పూడిక తీత, క్లోరినేషన్ వీధుల్లో దోమల నివారణ మందులు స్ప్రేయింగ్ చేయాలని జిల్లా మలేరియా అధికారి AM పాలకొండ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ ఇప్పటికే చాలామంది దోమల వలన తీవ్రమైన మలేరియా జ్వరాలు బారిన పడుతున్నారు. దానికి కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వలన చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనితెలిపారు. అలాగే ప్రాణనష్టం కూడా జరుగుతుంది కావున అధికారులు దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ తరపున కోరడం జరిగింది. దీనికి సానుకూలంగా AM స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతిపురం నాయకులు చందక అనిల్, వీర మహిళా విభాగం నాయకురాలు లక్ష్మి రాజ్, జనసేన నాయకులు రవి, జనసైనికులు పాల్గొన్నారు.