Logo
Date of Publish : 25 June 2022, 12:51 pm
Editor : Sake Naresh

ట్రైబల్ ఏరియాలో సీజనల్ వ్యాధులకై నివారణ చర్యలు చేపట్టాలి : జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

     పాలకొండ, (జనస్వరం) : మన్యం పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో ప్రజల ఆరోగ్య దృష్ట్యా డెంగ్యూ, మలేరియా, వ్యాధులు ప్రబలకుండా ప్రాంతాల్లో పాలకొండ నగరంలో పూడిక తీత, క్లోరినేషన్ వీధుల్లో దోమల నివారణ మందులు స్ప్రేయింగ్ చేయాలని జిల్లా మలేరియా అధికారి AM పాలకొండ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సత్తిబాబు  మాట్లాడుతూ ఇప్పటికే చాలామంది దోమల వలన తీవ్రమైన మలేరియా జ్వరాలు బారిన పడుతున్నారు. దానికి కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వలన చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనితెలిపారు. అలాగే ప్రాణనష్టం కూడా జరుగుతుంది కావున అధికారులు దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ తరపున కోరడం జరిగింది. దీనికి సానుకూలంగా AM స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతిపురం నాయకులు చందక అనిల్, వీర మహిళా విభాగం నాయకురాలు లక్ష్మి రాజ్, జనసేన నాయకులు రవి, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com