
రాజాం ( జనస్వరం ) : నియోజకవర్గం, సంతకవిటి మండలం, మంతిని గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 8 ఇల్లు పూర్తిగా ధ్వంసం అవ్వడం జరిగింది. విషయం తెలుసుకున్న రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజుగారు బాధితులను పరామర్శించి వారికి నెలకు సరిపడా సరుకులు అందజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరఫున అందవలసిన తక్షణ సాయం కోసం ఎమ్మార్వో గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ని రాజు గారితో పాటు జనసైనికులు మనోజ్ కుమార్, చీమల గోవింద్, రంగస్థలం గోవింద్, అన్నం నాయుడు, వెంకట నాయుడు, శంకర్, లెంక అన్నం నాయుడు, నారాయణ రావు, ధ్రువ, అప్పలనాయుడు పాల్గొనడం జరిగింది.