కదిరి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు విద్యుత్ కోతలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని, ఒక పక్క ఎండలతో ప్రజలు సతమతమౌతుంటే, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై భారం మోపి, అలాగే పల్లె ప్రాంతాలలో దాదాపు 14 గంటలు, పట్టణ ప్రాంతాల్లో 4 గంటలు కోతలు విధిస్తున్నారు. దీనివలన రైతులు, విద్యార్థులు, శ్రామికులు ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలలో కూడా వారంలో రెండు రోజులు విద్యుత్ హాలిడే ప్రకటించారు. దీనివలన పారిశ్రామికంగా రాష్ట్రం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో 240 నుంచి 250 మిలియన్ యూనిట్లు విద్యుత్తు వినియోగం ఉంటే, ఉత్పత్తి 190 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంది. బొగ్గు నిల్వలు కూడా మూడు రోజులకు మాత్రం సరిపడా ఉన్నాయి. దీనికి ప్రభుత్వం ముందుచూపు లేకపోవడమే కారణం. ఇదే పక్క రాష్ట్రం తెలంగాణలో అయితే వాళ్లు ముందు చూపుతోనే విద్యుత్ ఒప్పందాలు చేసుకొని విద్యుత్ కొరత లేకుండా చూసుకున్నారు. ఈ రోజు పేపర్లో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ లేకపోవడంతో కాన్పులు, ఆపరేషన్లు కూడా చార్జింగ్ లైట్లతో చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని ఇంత విద్యుత్ సంక్షోభంలోకి నెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించి అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రవీంద్ర, చెక్క రమణ, కుట్టాల లక్ష్మణ్, పట్నం నాగేంద్ర, అంజి బాబు, రాజా, కార్తీక్, అదిశేషు, నాగేంద్ర, శ్రీకాంత్, రవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.