మాడుగుల జనసేన నాయకుల ఆధ్వర్యంలో పల్లె-పల్లెకి జనసేన

    మాడుగుల, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గములో జనసేన పార్టీలోకి జోరందుకున్న వలసలు. చిడికాడ మండలంలో తంగుడుపల్లి గ్రామంలో అనేక మంది వైసీపీ మరియు టీడీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు.  పల్లె- పల్లెకి జనసేన  కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ నాయకులు గుమ్మడి శ్రీరామ్ ఇంటి ఇంటికి తిరిగి జనసేన పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను, జనసేన పార్టీ హామీలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. మాడుగులలో 2024 ఎన్నికలలో జనసేన జెండా ఎగురుతుంది అని ప్రజలు, జనసైనికులు ఆశాభావం వ్యక్తo చేశారు.

See also  జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలలో 3వ రోజు