చిత్తూరు ( జనస్వరం ) : రాష్ట్ర ప్రభుత్వం నిధులను పంపిణీ చేస్తూ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక లేకుండా అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య విమర్శించారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల పేర్లను మార్చి, కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ స్వంత పథకాలుగా ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్నదన్నారు. మరో వైపు వివిధ రకాల పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని ఆయన హెచ్చరించారు. ఈనెల 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అనే 6 హామీలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హామీలు అన్ని వర్గాల వారిని సంతృప్తిపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించే విధంగా ఉన్నాయని అన్నారు. సామాన్య జనాలకు ఇసుక ఉచితం చేయడం ద్వారా ప్రతీ ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేసేలా ఉందని తెలిపారు.