Logo
Date of Publish : 20 March 2022, 12:11 pm
Editor : Sake Naresh

సంక్షేమ జపం, అభివృద్ధి శూన్యం : జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య

           చిత్తూరు ( జనస్వరం ) : రాష్ట్ర ప్రభుత్వం నిధులను పంపిణీ చేస్తూ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక లేకుండా అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య విమర్శించారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల పేర్లను మార్చి, కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ స్వంత పథకాలుగా ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతున్నదన్నారు. మరో వైపు వివిధ రకాల పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని ఆయన హెచ్చరించారు. ఈనెల 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అనే 6 హామీలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హామీలు అన్ని వర్గాల వారిని సంతృప్తిపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించే విధంగా ఉన్నాయని అన్నారు. సామాన్య జనాలకు ఇసుక ఉచితం చేయడం ద్వారా ప్రతీ ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేసేలా ఉందని తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com