విశాఖపట్నం ( జనస్వరం ) : మాడుగుల నియోజకవర్గం, చీడికాడ జనసేనపార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ ఈనెల 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అనే 6 హామీలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హామీలు అన్ని వర్గాల వారిని సంతృప్తిపరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించే విధంగా ఉన్నాయని అన్నారు. సామాన్య జనాలకు ఇసుక ఉచితం చేయడం ద్వారా ప్రతీ ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేసేలా ఉందని తెలిపారు. జనసైనికులు అందరూ ఈరోజు నుంచి మొదలుకొని షణ్ముఖ వ్యూహంలో ఉన్న 6 హామీలను ప్రతి గడపకు చేరే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, హామీలతో పాటుగా అధికార పార్టీ యొక్క వైఫల్యాలను కూడా ప్రతి ఒక్కరికీ వివరించాలని మాడుగుల నియోజకవర్గ జనసైనికులు అందరూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జనసేన సిద్ధంగా ఉందని తెలియజేశారు. సామాన్యుల కోసం, రైతుల కోసం, నిరుద్యోగులు, ఉద్యోగులు కోసం అలోచించి ఇలాంటి హామీలను ప్రకటించిన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం నాలుగు మండలాల జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.