● ఇది తిరుపతి ప్రజల ఆకాంక్ష.
● కోరుకునే వాళ్లు అన్ని సోషల్ మీడియాలలో ప్రభుత్వానికి చేరేవరకు షేర్ చేయండి.
● తిరుమల తిరుపతి దేవస్థానం అనేది నానుడి – బాలాజీ టిటిడి అని పలకరు కదా !
● తిరుపతి జనసేనపార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్
తిరుపతి, (జనస్వరం) : రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాల పేర్లు తదితర అభ్యంతరాలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపాలని సూచించారు. తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ తిరుపతి స్థానికుడిగా నడుం బిగించి తిరుపతి జిల్లా కావాలంటూ పోరాటం చేస్తున్నాను. ముఖ్యమంత్రికి తెలిసే విధంగా అన్ని సోషల్ మీడియాలలో, జనసంద్రంతో కలిసి విద్యార్థులు తయారుచేసిన ఆకర్షణీయమైన లోగోతో తిరుపతి జిల్లా కోరుకుంటున్న పీపుల్స్ కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. కాలేజీ స్టూడెంట్స్ సుమన్ బాబు, బలరాం, రమేష్ రెడ్డి, కిషోర్, బాల, నరేష్, మనోజ్, కిషోర్ రెడ్డి, చరణ్ రాయల్, షరీఫ్, గోపి స్వామి, బాలాజీ తదితరులతో కలిసి వెల్లడించారు. స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా మిత్రులు మధ్య ఆకర్షణీయమైన లోగోను విడుదల చేశారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తాము శాంతియుతంగా తిరుపతి జిల్లా పేరు కోసం నడుం బిగించి ప్రజలతో మమేకమవుతున్నామన్నారు. తిరుపతి సిటిజెన్స్ పేరుతో అలిపిరి గరుడ, కాళహస్తి, శ్రీహరికోట, శ్రీ సిటీ తదితర ముఖ్య ప్రదేశాలను కలుపుకుని తిరుపతి ఇట్సల్ఫ్ ఏ బ్రాండ్ డోంట్ చేంజ్ ఇట్స్ నేమ్, అనే ఆకర్షణీయమైన లోగోతో లోతుగా అర్థమయ్యే రీతిలో ప్రెస్ క్లబ్ లో వారి మనోభావాలను వ్యక్తం చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ తదితర అన్ని సోషల్ మీడియాలలో తిరుపతి జిల్లా పేరును కోరుకునే వారంతా ఒక్క క్లిక్కుతో వారి అభిప్రాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయాలని కిరణ్ రాయల్ ఈ సందర్భంగా కోరారు.