
రాజంపేట, (జనస్వరం) : కడప జిల్లా విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లాగా రాజంపేటను ప్రకటించాలి అని జనసేన నాయకులు చెంగారి శివ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో పార్లమెంట్ కేంద్రంగా రాజంపేట ఉంది. అలాగే సబ్ కలెక్టర్ ఆఫీస్, మరి ముఖ్యంగా రాయచోటి తాగు నీటి కొరత తీవ్రంగా ఉన్నది. రాయచోటితో పోల్చుకుంటే రాజంపేటలో నీటి సౌలభ్యతతో అన్ని వసతులు ఉన్నాయి అని అన్నారు. రాజంపేట జిల్లా సాధనలో విఫలం ఐన MLA, జడ్పీటీసీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయాలి అని DR అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రాజు కోలాట హరి, లతీఫ్, కత్తి సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు.