న్యూస్ ( జనస్వరం ) : విద్యార్థి దశలో నుండే యువ నాయకుడిగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్సీగా పని చేశారు. ప్రస్తుత రాజకీయ నాయకులలో మంచి విలువలతో, నీతివంతమైన నాయకుడిగా తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు ఎదిగారు. ఆయన మాట్లాడుతూ విధాన పరమైన రాజకీయాలు, నీతివంతమైన రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇక్కడ మేము క్షేత్ర స్థాయిలో పని చేస్తుంటే, జనసేన ఎన్నారై జనసైనికులు కూడా అదే స్థాయిలో పార్టీ కోసం ఆర్థిక సహాయం, మోరల్ సపోర్ట్ అందిస్తున్నారు. 4 సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వ పాలన విచ్చిన్నమై, నియంతృత్వ పాలన సాగడం వలన ఆ పార్టీ పతనం తెచ్చుకుంది. త్వరలో ప్రజల చేతిలో వైసీపీ పార్టీ పతనమవుతుందని అన్నారు. గతంలో ఉన్న జనసేనపార్టీ, ఇపుడు ఉన్న జనసేనపార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో నమ్మకాన్ని నిలబెట్టుకొని పార్టీ చాలా పుంజుకొంది. జనసేనపార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారు. కౌలు రైతు భరోసా, జనవాణి కార్యక్రమాల ద్వారా జనసేన ప్రజలలో నమ్మకాన్ని నిలబెట్టుకుంది. క్రియాశీలక సభ్యత్వ నమోదు గతంలో బాగా జరిగింది. ఈ సంవత్సరం మరింత ఎక్కువ నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. గత సంవత్సరం బాధితులు ప్రమాద భీమా రమారమి 6 కోట్ల వరకూ అందుకున్నారు. ఇతర పార్టీలలో క్రియాశీలక సభ్యత్వం లేదు. ఇటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం అందించడం గొప్ప పరిణామం. వైసీపీ పార్టీకి ప్రజాధారణ తగ్గుతోందని ఈ మధ్య సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. ఎన్నికలు ముందస్తుగా వచ్చినా, ఎపుడూ వచ్చినా జనసేనపార్టీ ఎన్నికలలో పోరాటడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇపుడు మనకు సమయం ఉంది. కష్టపడదాం. ఇప్పటివరకు జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు చేసాం. బూత్ లెవల్ కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో కూడా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం. గత ఎన్నికల్లో జగన్ పాదయాత్ర, వాళ్ళ నాన్న సానుభూతి వల్ల అధికారం పొందారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు. ప్రజలు వైసీపీ పార్టీని చీదరించుకుంటున్నారు. మనం టీడీపీ పార్టీ కంటే ఎక్కువ శాతం పోరాటపటిమని చూపిస్తున్నాం. బలమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాం. ప్రజలు కూడా జనసేనపార్టీని ఆదరిస్తున్నారు. ఏప్రిల్ నుండి జనసేనపార్టీ మరింత వ్యూహాలను అందిపుచ్చుకుని క్షేత్రస్థాయిలో మరింత బలపడనుంది. యువత వింగ్, మహిళా వింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నుండి అమలులోకి వస్తాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వర్క్ జరుగుతోందన్నారు. పొత్తులు అనేవి జనసేన అధ్యక్షుల నిర్ణయం. మనమెవరూ వాటి గురించి ఆలోచించకూడదు. అధ్యక్షులు నిర్ణయించిన నిర్ణయాన్ని శిరోద్యారంగా భావిద్దామని అన్నారు. వివిధ నియోజకవర్గ ఎన్నారై జనసైనికులు, వీరమహిళలు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు.