న్యూస్ ( జనస్వరం ) : JSP గ్లోబల్ టీం సభ్యులు సురేష్ వరికూటి అధ్యక్షతన వివిధ దేశాల ఎన్‌ఆర్‌ఐ జనసైనికులతో జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ చిలకం మధుసూధన్ రెడ్డి గారు హాజరయ్యారు. చిలకం మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ దేశాల జనసైనికులతో జూమ్ సమావేశం కావడం చాలా ఆనందంగా ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకపాలన ఎక్కువ అయిందని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు జనసేనపార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా పోరాడుతున్నదని అన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం ” సేవ్ ధర్మవరం ” అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని అన్నారు. ధర్మవరం స్థానిక ఎమ్మెల్యే కేతంరెడ్డి చేసే అరాచక పాలన గురించి, ఆయన నిర్వహించే ” గుడ్ మార్నింగ్ ధర్మవరం ” కార్యక్రమం భాగోతం గురించి తెలియజేశారు. వైసీపీ ఎమ్మెల్యే యొక్క అక్రమాలను నిలదీస్తూ, ధర్మవరం నియోజకవర్గ ప్రజలను చైతన్యవంతంగా తీసుకెళ్తున్నామని అన్నారు. జనసేన పార్టీ నిర్వహిస్తున్న కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి ఇతర కార్యక్రమాలు ప్రజలలో మంచి స్పందన వస్తోందని అన్నారు. రాయలసీమలో ఎంతో మంది నాయకులు సీయంలు వస్తున్నారు, పోతున్నారు. కానీ, రాయలసీమ అభివృద్ధి శూన్యం అని చెప్పాలి. నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళడం బాధాకరం. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే రాయలసీమను అభివృద్ధి చేయడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అలాగే NRI జనసైనికులు పార్టీ కోసం ఆర్థికంగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో వెళ్ళేలాగా బలమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని అన్నారు. అక్టోబర్ 5 నుండి పవన్ కళ్యాణ్ గారి యాత్ర కూడా ప్రజలలో మార్పు తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. అలాగే నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వివిధ నియోజకవర్గ ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు తమ సందేహాలను మధుసూధన్ గారిని అడగ్గా వారికి ఓపికతో సమాధానాలు ఇచ్చారు.