Logo
Date of Publish : 24 October 2022, 5:07 pm
Editor : Sake Naresh

టీం సైనిక JSP Indo – NRIs ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జూమ్ కాల్ సమావేశం

         న్యూస్ ( జనస్వరం ) : టీం సైనిక JSP Indo - NRIs ఆర్గనైజేషన్ ఫౌండర్ అమీర్ ఖాన్ (సౌదీ అరేబియా) నేతృత్వంలో , పాపోలు అప్పారావు (దుబాయ్ పారిశ్రామిక వేత్త, యూఏఈ టీం లీడర్) గారి అధ్యక్షతన జూమ్ కాల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ వీర మహిళా విభాగం వైస్ చైర్ పర్సన్ రత్నా పిల్లా, నా సేన - నా వంతు కో కన్వీనర్, సెంట్రల్ కమీటీ పార్టీ అఫైర్స్ వైస్ చైర్మైన్ కోట రుక్మిణీ (లండన్), జనసేన నాయకులు నల్లం శ్రీనివాసు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా నుండి సాయి కృష్ణ తేజ తమ స్కాలర్షిప్ పై, తుందుర్రూ గ్రామ ఎంపీటీసీ అరేటి వాసు మెగా ఆక్వా పార్క్ ఉద్యమంలో 150 మందికి పైగా పెట్టిన కేసులు, నెల్లూరు జిల్లా రూరల్ కార్యదర్శి షేక్ షానవాజ్ కార్పొరేటర్ గా నామినేషన్ వేసిన సమయంలో జరిగిన అవకతవకలు గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. గుంటూరు జిల్లాలో వున్న రాజకీయ సమస్యలపై దార్ల మహేష్, సత్తెనపల్లి 18వ వార్డు అభ్యర్థి చింతల అరుణ కుమారి w/o వెంకట్  తమ అనుభవాలను పంచుకున్నారు. కులాలను కలుపుకు పోయే విధానంపై దళిత సత్తా నాయకుడు రెగిడి లక్ష్మణ్ , విజయవాడ నుండి వీర మహిళా నాయకురాలు నందినీ చౌదరి గ్రౌండ్ లెవల్లో కార్యకర్తలకు దిశా నిర్దేశంపై వివరించారు. బూత్ పోలింగ్ మేనేజ్మెంట్ కోసం ఒంగోలు నుండి పరుచూరి అవినాష్, కూటల లక్ష్మణ్ అనంతపురం నుండి పార్టీ శ్రేణులు ఎదుర్కుంటున్న సమస్యలపై వివరించారు. జనసేన నాయకులు, సైనికులు, వీర మహిళలు తమ అనుభవాలను, సమస్యలను ముఖ్య అతిధులతో పంచుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీర మహిళా నాయకురాళ్లు వసంతాల ప్రభావతి, షేక్ ముంతాజ్, మొలబంటి లక్ష్మీ, కాజా సుజాత, కొల్లు నరేష్, P.కల్యాణి (USA), షాహెద్ (సౌదీ అరేబియా), విజయ్ గౌడ్ (కువైట్), పవన్ కుమార్ (కర్నూల్ జిల్లా), S.సుధాకర్ (E.G.dist), నాగ మల్లేశ్వర రావు (గుంటూరు జిల్లా), అచ్యుత నాయుడు, సౌజన్య (W.G.Dist), ఉమా మహేశ్వరి (కృష్ణా జిల్లా), వీరభద్ర గ్రూప్, VK సోషల్ మీడియా, JSP మంగళగిరి టీం, టీం సైనిక గ్రూప్ మరియు తదితర జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com