Logo
Date of Publish : 04 January 2023, 4:10 pm
Editor : Sake Naresh

జనవరి 12న శ్రీకాకుళంలో పవనన్న ముందు యువ గళాన్ని వినిపించే యువశక్తి భారీ బహిరంగ సభ

- పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

     నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 233వ రోజున 11వ డివిజన్ సరస్వతి నగర్ స్రవంతి స్కూల్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనవరి 12న శ్రీకాకుళంలోని రణస్థలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో లక్షలాది యువతీయువకుల నడుమ "యువశక్తి" పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆ సభలో అధ్యయనం చేస్తారని అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం వలన ఆ ప్రాంత యువతీయువకులు కోల్పోయిన అనేక అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ గారి ఎదుట తమ గళాన్ని ప్రసంగం రూపంలో వినిపించే అవకాశం పలువురు యువతీ యువకులకు కల్పించడం జరుగుతుందని, ఆ అవకాశం పొందేందుకు జనవరి 5 నుండి 8 వరకు 08069932222 నెంబర్ కి ఫోన్ చేసి రాష్ట్రంలో తాము అధ్యయనం చేసి పలు సమస్యల పైన, అంశాలపైన వాయిస్ రికార్డ్ రూపంలో వివరించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com