Logo
Date of Publish : 14 December 2022, 4:10 pm
Editor : Sake Naresh

హుకుంపేట జనసేన నాయకులు ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్లు ఆవిష్కరణ

      హుకుంపేట, (జనస్వరం) : అల్లూరిసీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో జనసేనపార్టీ నిర్వహించే యువశక్తి పోస్టర్ లను హుకుంపేట మండల కేంద్రంలో గల ప్రధానకూడలిలో బలిజ కోటేశ్వరరావు పడాల్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. జనసేన యువశక్తి పోస్టర్ ఆవిష్కరణలో ముఖ్య అతిధిగా డా వంపూరు గంగులయ్య జనసేనపార్టీ పాడేరు అరకు పార్లమెంట్ ఇంచార్జి, అరకు నియోజకవర్గం ప్రధాన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా..గంగులయ్య మాట్లాడుతూ వచ్చేనెల జనవరి 12 వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో పెద్దఎత్తున యువశక్తి రణభేరి జనసేనపార్టీ తరుపున నిర్వహించబోతున్నామని స్వయంగా అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువత యొక్క ప్రధాన సమస్యలపై, నిరుద్యోగ సమస్యలపై, విద్యా, ఉపాధి కల్పనపై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు. మీరందరు యువకులు ఈ దేశానికి మొట్టమొదటి సంపద యువత ఆ యువత ఆకాంక్షలు, ఆశయాలు, లక్ష్యాలు నీరుగార్చే ప్రభుత్వ విధానాన్ని లక్షలమంది జనసైనికులతో కలిసి నేరుగా ప్రభుత్వంతో డీ కొనబోతున్నాం. అల్లూరిసీతారామరాజు జిల్లా నుంచి కూడా అశేష సంఖ్యలో జనసైనికులు పాల్గొని యువశక్తి కార్యక్రమములో విధిగా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నమంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు ముఖ్యనాయకులు కోటేశ్వరరావు పడాల్ బలిజ, శ్రీరామ్ మాదాల, రామదాస్ బంగారు, సాయిబాబా దురియా, వీర మహిళ రత్నప్రియా, పాడేరు జనసేనపార్టీ మెంబర్ కొర్ర కమల్ హాసన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com