గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండల కేంద్రంలో ఉన్న కోవిడ్ కేంద్రాన్ని జనసేన పార్టీ ఇంఛార్జ్, రాయల దక్షిణ కోస్తా జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు యుగంధర్ పొన్న గారు సందర్శించారు. పాజిటివ్ బాధితులను పరామర్శించారు. అక్కడి ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ కోవిడ్ నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత ఆ బెడ్లను శానిటైసోర్ చేయకుండా, అలాగే కొత్త వారిని అడ్మిట్ చేసుకుంటున్నారని, క్లీనింగ్ సరిగా లేదని వాపోయారు. డ్యూటీ డాక్టర్, నర్సులను వారి ఆరోగ్య పరిస్థితులను, వారికీ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది వివరాలు అడుగుతూ వారికీ ఎదురైనా ఇబ్బందులను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ క్లీనింగ్ విషయంలో జాగ్రత్త వహించాలని, తరచూ కరోనా రోగులతో అప్పుడపుడు మాట్లాడుతు, వారిలో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందని, ఆహారం అందిచడంలో క్వాలిటీని తప్పకూడదని అధికారులకు తెలిపారు. స్థానిక తహసీల్దార్ కేంద్రంలో నడుస్తున్న అన్నీ సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి శోభన్ బాబు, నియోజకవర్గం కోఆర్డినేటర్ రాఘవ, జనసేన నాయకులు శివ, మహేష్, స్థానిక కేంద్ర సిబ్బంది మరియు తదితురులు పాల్గొన్నారు.