Logo
Date of Publish : 05 March 2021, 4:20 pm
Editor : Sake Naresh

రాజ్యాంగ విరుద్ధంగా అధికార పార్టీ అభ్యర్థులు నామినేషన్లు, నామినేషన్లను తొలగించాలని కోరిన యుగంధర్ పొన్న

               గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, ఆర్ కె వి బి పేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు అభ్యర్థిగా జయచంద్రా రెడ్డి నామినేషన్ దాఖలు చేసాడు. అయితే ఇతనికి ముగ్గురు శిరీష, నవ్య, కార్తీక్ అనే పిల్లలు ఉన్నారని జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జి యుగంధర్ పొన్న తెలిపారు. పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఇలాంటి వారిని వెంటనే వార్డు మెంబరుగా తొలగించి, రాజ్యాంగపు విలువలను కాపాడాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ని కోరారు. చట్టంమంటే గౌరవం లేదని, నిబంధనలను పాటించని ఎంతటి వారైనా శిక్షించాలని ఈ సందర్బంగా తెలియజేసారు. అధికారం మాదే ప్రభుత్వం కూడా మాదే, షరతులు వర్తించవు అన్న చందంగా పరిపాలని ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో చట్టం పట్ల గౌరవం పెంచాలని, అయితే ప్రజల్లో అసహనం పెరిగిందని తెలిపారు. కాబట్టి జయ చంద్ర రెడ్డిని వార్డ్ మెంబెర్ గా తొలగించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, నియోజకవర్గం కోఆర్డినేటర్ రాఘవేంద్ర పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com