SC.ST వ్యవసాయ భూముల మీద వైయస్ ఆర్ సీ పీ పార్టీ కన్ను : జనసేన పార్టీ రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్
గత ప్రభుత్వాలు ఇచ్చిన వ్యవసాయ భూమి మీద ఎంతోమంది SC.ST ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా వారి జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వ్యవసాయ భూములను వైయస్సార్సీపి పార్టీ స్థానిక నాయకుల అండతో దళారీలు కాజేయాలని చూస్తున్నారు. అక్కడ ప్రజలకు న్యాయం జరగాలంటే కేవలం జనసేన పార్టీ తోనే సాధ్యం అవుతుందని ఆశించి రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ ను కలవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సాకే పవన్ కుమార్ ఎస్సీ జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కుళ్ళాయప్ప గారితో కలిసి అక్కడ స్థానిక ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది.
ఈరోజు రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రురల్ మండల కేంద్రంలోని అలమూరు గ్రామానికి చెందిన SC,ST,BC కులాలకి చెందిన రైతులకు సంబంధించిన సర్వే నెంబర్ 503 లో 2005 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వీరికి పట్టా మంజూరు చేయడం జరిగింది. ఐతే ఇప్పడు వచ్చినా YCP ప్రభుత్వంలోని కొంతమంది YCP నాయకులు భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండడం అత్యంత దారుణం. అస్సయిమెంట్ ప్రకారం ఒక్క ఒక్క కుటుంబాన్ని 5 ఎకరాల భూమిని ఉండాలని నిబంధనలు ఉన్నపటికీ 40ఎకరాలు నాదే అంటూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంతే కాకుండా బరి తెగించి నిన్న రాత్రి కొంతమంది దుండగులు 5 సమత్సరాల నుండి పెంచుతున్న 60 మామిడి చెట్లు నరికేయడం చాలా బాధాకరం. YCP ప్రభుత్వం మాది, రైతు ప్రభుత్వం అనే మీరు ఇలాంటి సంఘటనలకు మీరు ఏమి సమాధానం చెబుతారు అని నాయకులని నిలదీశారు. అదేవిధంగా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో సచివాలయం కట్టాలని నెపంతో ఏళ్ళ తరబడి ఉంటున్న వారిని బెదిరించడం, వారిని భయ౦దోళనకు గురి చేయడం అత్యంత బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులని అరికట్టాలి, భారత రాజ్యాంగన్ని కాపాడాలి, హక్కుల ద్వారా మా భూములు మాకు వచ్చేవిధంగా చేపట్టాలని లేకుంటే భవిష్యత్తులో తిరుగుబాటు ఉద్యమాలకు శ్రీకారం చుడుతాం అని అన్నారు. మా హక్కులను మేము కపాడుకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం SC, ST,BC భూములను దృష్టిలో పెట్టుకొని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నాయి అన్నారు. అంతేకాదు దళితుల భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోము అని ఆవేదన వ్యక్తం చేశారు.