Logo
Date of Publish : 21 January 2026, 10:40 pm
Editor : Sake Naresh

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నేతలు

నియోజకవర్గ వైయస్ ఆర్ సి పి సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నేతలు

సత్తెనపల్లి,జనవరి21.(జనస్వరం)

నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి అధ్యక్షతన సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయంలో వైయస్సార్సీపి సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథులుగా టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు టిజే సుధాకర్ బాబు, పార్లమెంటు పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి టాస్క్ ఫోర్స్ సభ్యులు వనిపెంట వీరారెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ పార్టీ పదవుల్లో పార్టీకి కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని అందరూ వారికి కేటాయించిన పదవులకు వన్నె తీసుకువచ్చి జగనన్నను ముఖ్యమంత్రి నీ చేయడంలో కీలకపాత్ర పోషించాలని వారికి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఎప్పుడూ ఉంటుందని తెలియ జేశారు. టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు టిజే సుధాకర్ బాబు మాట్లాడుతూ కమిటీలను త్వరగా పూర్తి చేయాలని తద్వారా నియోజకవర్గంలో పట్టణ మండల గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని పార్టీకి కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. పార్లమెంటు పరిశీలకులు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణంలో పదవులు కష్టపడ్డ కార్యకర్తలకే దక్కాలని ,పార్టీ అధికారంలో లేనప్పుడు జెండా పట్టుకుని తిరిగిన కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, పార్టీలో సీనియర్ నాయకులు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, సీనియర్లు పార్టీకి దిశా నిర్దేశం చేయాలని తెలియజేశారు.పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత పరిపాలన కాలంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా రాబోయే రోజుల్లో నాయకులు మరియు కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.నియోజక వర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2.0 పరిపాలనలో కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, కార్యకర్తలే ముందుండి పరిపాలన చేసే రోజులు వస్తున్నాయని తెలియ జేశారు.అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో టిడిపి వల్ల ఇబ్బంది పడ్డ కార్యకర్తలు తాము పడ్డ ఇబ్బందులను డిజిటల్ బుక్ లో నమోదు చేయాలని, వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ వార్డు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com