Logo
Date of Publish : 02 May 2023, 3:56 pm
Editor : Sake Naresh

పవన్‌ కళ్యాణ్‌పై వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తే సహించేది లేదు

         ధర్మవరం ( జనస్వరం ) : పవన్‌ కళ్యాణ్‌పై వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తే సహించేది లేదంటూ ఖబర్దార్  అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ ఎవరితోనైనా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారని, అడగడానికి వైసిపి మంత్రులు ఎవరని వారు ప్రశ్నిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు వైసిపి పాలనలో విసుగు చెందారని, ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారని, 2024లో ప్రజలు తప్పక వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి అభద్రత భావన ఉండటం వల్లనే తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై జగన్‌ తో పాటు మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కలిస్తే వైసిపి మంత్రులకు వచ్చిన నష్టమేమో మాకు అర్థం కాలేదని తెలిపారు. మంత్రులు రోజా, పేర్ని నాని, కొడాలి నాని లు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఇకపై మా కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకుండేది లేదని వారు గట్టిగా హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్షాలు ప్రశ్చిస్తే, పోలీసులతో కేసులు పెట్టించినంతమాత్రాన, భయపడేది లేదని వారు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com