Logo
Date of Publish : 13 October 2022, 3:47 am
Editor : Sake Naresh

ప్రజాసేవ కోసం పదవులిస్తే – ఆ పదవులకే మచ్చ తెస్తున్నారు వైసీపీ మంత్రులు : తిరుపతి జనసేన నాయకులు

• మంత్రి రోజా కౌంటర్లు తెరిచి మరీ దర్శనం టిక్కెట్లు అమ్ముకుంటున్నారు

• మంత్రి ప్రోటోకాల్ దర్శనం వివరాలు బయటపెట్టాలి

•  పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు బదులిచ్చే దమ్ము మీకుందా?

• మీడియా సమావేశంలో జనసేనపార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి

        తిరుపతి, (జనస్వరం) : ప్రజలకు సేవ చేయమని పదవులు ఇస్తే మంత్రులు ఆ పదవులకు కళంకం తెచ్చే రీతిన ప్రవర్తిస్తున్నారని దేవుడి సొమ్ము తినడానికి కూడా వెనుకాడడం లేదని జనసేనపార్టీ తిరుపతి నగర అధ్యక్షులు జె.రాజారెడ్డి స్పష్టం చేశారు. జగన్ రెడ్డి మెప్పు కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మీద లేనిపోని నిందలు వేస్తే రోడ్ల మీద తిరగనివ్వమని హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో పార్టీ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్వీట్ల నేపథ్యంలో ఆయనపై మంత్రులు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఈ సందర్భంగా రాజరెడ్డి మాట్లాడుతూ "రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తెలియచేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నాస్త్రాలు సంధిస్తే.. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో మంత్రులు రోడ్డు మీద పడి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మంత్రి పదవులు కాపాడుకోవాలంటే ప్రజల మధ్యకు రండి. మీకు ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయండి. అది వదిలి 24 గంటలు పవన్ కళ్యాణ్ జపం చేస్తారేంటి? రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్  నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న సంగతి మీకు అర్ధం అయ్యే మీకు భయం పట్టుకుంది. రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితులు లేవన్న సంగతి గుర్తు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు వెనకాముందు చూసుకుని మాట్లాడండి.  కొండకు వెళ్ళేది దర్శనం కోసం కాదు మంత్రి రోజా తిరుమల కొండ మీదకు వెళ్లి రాజకీయాలు మాట్లాడుతారు. ఆమె పదే పదే కొండ మీదకు వెళ్లేది దేవుడి దర్శించుకునేందుకు కాదు. దర్శనం టిక్కెట్లు అమ్ముకునేందుకు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రత్యేక కౌంటర్లు తెరిచి మరీ ప్రోటోకాల్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారంట. అమ్మా... రోజమ్మా ఇంతకీ ఒక్కో ప్రోటోకాల్ టిక్కెట్టు మీరు ఎంతకు అమ్ముకుంటున్నారో సెలవిస్తారా? మీకు దమ్ముంటే ఇప్పటి వరకు మీరు దర్శనం చేయించిన వారి వివరాలు బయటపెట్టగలరా? కౌంటర్ తెరిచి మరీ దర్శనం టిక్కెట్లు వ్యాపారం చేస్తున్న మీరా మాట్లాడేది. మీ నియోజకవర్గం నగరిలో మీకు గడప గడపకు తిరిగే దమ్ముందా? ఐటీ అన్న పదానికి అర్ధం తెలియని అమర్నాథ్ ఐటీ శాఖకు మంత్రి. మీకసలు మీ శాఖల గురించి తెలుసా? అధికారంలో ఉన్న పార్టీల మోచేతి నీళ్లు తాగే మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది" అన్నారు.

• మచ్చలేని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ : ఆకేపాటి సుభాషిణి రాష్ట్ర కార్యదర్శి

           ఆకేపాటి సుభాషిణి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేకే మంత్రులు ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా మచ్చలేని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సమావేశంలో నగర కమిటీ సభ్యులు సుమన్ బాబు, మునస్వామి, బలరామ్, సుమన్,  లక్ష్మి, సాయి, పురుషోత్తం, పవన్, ఆదికేశవులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com