Logo
Date of Publish : 23 February 2024, 9:27 pm
Editor : Sake Naresh

ఆముదాలవలసలో జనసేన టిడిపి మద్దతుదారుల పట్ల వైసిపి నేతల దాష్టికం

  ఆమదాలవలస ( జనస్వరం ) : మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్ముడుపేట కు చెందిన జనసేన టిడిపి మద్దతుదారులు అయిన కిల్లి ప్రసాద్ యొక్క కోళ్ల ఫారం ను గత రాత్రి స్థానిక వైసిపి దుండగులు భారీ యంత్రాలతో పూర్తిగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలో మద్దతుదారులపై వైసిపి తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్ట పరిహారాన్ని అంచనా వేసి బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని అలాగే, ఈ సంఘటనకు గల కారకులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 15 సంవత్సరాలు లీజుకు ఉన్న స్థలాన్ని కాలపరిమితే పూర్తిగాకముందే తిరిగి అప్పగించాలంటూ వైసీపీ నేతలు బెదిరించారని, కానీ ఇంకా కాల పరిమితి ఉన్నందున న్యాయపరంగా కోర్టు నోటీసులు సదరు స్థల యజమానికి అందించే క్రమంలో గత రాత్రి కోళ్ల ఫారం పై జెసిబి లతో పూర్తిగా ధ్వంసం చేశారని సమాచారం. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని దాదాపు కోటి రూపాయలు విలువచేసే ఈ కోళ్ల ఫారం ను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయంపై బాధితులతో కలిసి రామ్మోహన్ రావు స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com