అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే వైసీపీ నాయకులకు అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ బాల్యం రాజేష్ ప్రశ్నలు సంధించారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వల్లనే రాష్ట్ర అప్పు దాదాపు ఐదు లక్షల కోట్లు అయ్యిందా ? నిత్యావసరాల ధరలు పెరిగాయా ? రోడ్లు అద్వానంగా తయారయ్యాయి ? పెట్రోల్ ధరలు, విద్యుత్ బిల్లులు పెరిగాయా ? ప్రత్యేక హోదా రాలేదు ? విభజన హామీలు నెరవేరలేదు ? పోలవరం పూర్తి కాలేదు ? రైతుల ఆత్మహత్యలు జరిగాయ్ ? రోజుకో ఉద్యోగ సంగం రోడ్డు నెక్కుతుంది ? నిజమే సార్ ఆయన వల్ల ఇంత నష్టం ఉంటే తప్పకుండా! ఆలోచన చేయాలని ప్రజల్ని కోరారు. ఆలోచన చేయాలి తప్పకుండా చేయిస్తాం మేమున్నది దేనికీ అందుకే మీలా డబ్బులు తీసుకోం మంచికోసం మా డబ్బు వ్యచ్చిస్తాం… ఈ ఊక దంపుడు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? మీ లాగా పవన్ కళ్యాణ్ గారు ప్రజాధనం లూటీ చేయలేదు మూడు పెళ్ళిళ్ళ వల్ల ప్రజల కొచ్చిన కష్టం ఏమీలేదన్నారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకొని పెళ్లి చేసుకున్నారు… కోట్ల మంది ప్రజాధనం అవినీతిమయం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మీ పరిపాలన గురించి, పాలసీలు గురించి విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పగా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం పద్ధతి కాదని, ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు… మంత్రులు ఎమ్మెల్యేలు వ్యక్తిగత జీవితం గురించి విమర్శించే ముందు మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఏ శాఖలో ఏముంటాయో కూడా తెలియని మంత్రులు ఉన్నారు. విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం జరక్కుండా అనేక ఇబ్బందులు పెట్టి అక్రమ కేసులు నమోదు చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారం ఎక్కడ వస్తుందో అని వైసిపి నాయకులకు భయం పట్టుకుందన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను వైసీపీ వాళ్లు వక్రీకరిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులకు చెప్పు చూపిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తే కొడతా అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్రమ కేసులు పెట్టిన దాడులు చేసిన జనసేన పార్టీ గెలుపును మీరు ఆపలేరు అని తెలియజేస్తున్నామని అన్నారు.