లింగపాలెం ( జనస్వరం ) : లింగపాలెం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్మాజిగూడెం బస్టాండ్ సెంటర్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి గుమ్మడి కాయతో దిష్టి తీసి పాలాభిషేకం చేసిన జనసేన నాయకులు.. అనంతరం బస్టాండ్ సెంటర్ లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లింగపాలెం మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు మాట్లాడుతూ వారాహి విజయ యాత్రలో భాగంగా ఏలూరు బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థలో ఉన్న లోపాలు గురించి చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు వక్రీకరించి వాలంటీర్లను ఉసిగొల్పి లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, దిష్టిబొమ్మను దహనం చేయడం లాంటి పిరికి చర్యలు మానుకోవాలని, పవన్ కళ్యాణ్ గారు అడిగిన కాగ్ నివేదికలోని అంశాలకు సమాధానం చెప్పలేక తప్పించుకునే మార్గంలో భాగంగా వాలంటీర్లను కావాలని రెచ్చగొట్టి ధర్నాలు చేపించారని ఆరోపించారు.. మాజీ మండల ప్రెసిడెంట్ మాదాసు కృష్ణ మాట్లాడుతూ వైసిపి నాయకులు చెప్పే మాయమాటలు నమ్మొద్దని వాస్తవాలు గ్రహించాలని, 5000/- వేలు రూపాయల జీతానికి మీ బంగారు భవిష్యత్తును తాకట్టు పెట్టొద్దని, జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిభ గల యువతకు 10 లక్షల రూపాయల ఉపాధి పెట్టుబడితో యువతని అభివృద్ధి దిశగా నడిపే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, వాలంటీర్లు వాస్తవాలను గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.. మండల ఉపాధ్యక్షుడు పటాన్ యాకూవలి మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి వైసీపీ నాయకులు అక్కసుతో అమాయకులైన వాలంటీర్లతో ధర్నాలు చేయించారని అన్నారు.. మండల ఉపాధ్యక్షుడు తాళం మల్లేశ్వరరావు మాట్లాడుతూ వాలంటీర్లు సేకరించే ప్రజల డేటా కొంత మంది వైసీపీ నాయకుల గుప్పెట్లో కి వెళ్తుందని తద్వారా మహిళలకు రక్షణ లేదని మాత్రమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారని, దానికి వైసీపీ నాయకులు పెడర్ధాలు తీశారని అన్నారు.. మండల ఉపాధ్యక్షుడు చల్లా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు తగులబెట్టి గొప్ప పని చేసామని భావించే వైసీపీ నాయకులు, వాలంటీర్లు వ్యవస్థలలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకోడానికి మా నాయకుడి పై బురద జల్లాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లింగపాలెం మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు, మాజీ మండల ప్రెసిడెంట్ మాదాసు కృష్ణ, ఉపాధ్యక్షులు పటాన్ యాకూవలి, తాళం మల్లేశ్వరరావు, చల్లా నాగబాబు, నిమ్మగడ్డ రామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మోదుగు అంజిబాబు, కార్యదర్శులు పుంజాల నరేంద్ర, పంది సతీష్ కుమార్, పొదిల మహేష్, సంయుక్త కార్యదర్శి కలకోటి నాగ దుర్గా పేరాచారి, మండల నాయకులు పోలిశెట్టి నాగరాజు, కోడూరి చందు, మెండం యశ్వంత్, జయంత్, బందెల సుధాకర్, మామిడి అనిల్, లక్కపాము విజయ్ మరియు జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com