కాకినాడ ( జనస్వరం ) : మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న అంగన్వాడీలకు కరప గ్రామ అధ్యక్షులు పేకేటి దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో అంగన్వాడి ఉద్యోగులకు మద్దతు తెలిపిన కరప మండల జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ నుండి పూర్తిస్థాయిలో మద్దతు ఉంటుందన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సేవలకు జనసేన పార్టీ తరఫున చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నారన్నారు. ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంగన్వాడీలకు వెయ్యి రూపాయలు జీతం ఎక్కువ ఇస్తానన్న పాదయాత్రలో ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు. అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టకుండా అంగన్వాడి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అలాగే అంగన్వాడీలకు, ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించిన 2253 కోట్ల రూపాయలు ఈ వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించారన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరసనకు కాకినాడ రూరల్ కరప మండలంలో ప్రభుత్వం నుండి ఎటువంటి ఇబ్బంది , ఒత్తుళ్ళు కలిగించిన స్థానిక జనసేన పార్టీ నాయకులకు తెలియపరిచిన వెంటనే మా జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీ కార్యక్రమానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కరప మండల సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప యువ నాయకులు యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ, కరప మండల ప్రధాన కార్యదర్శి పేపకాయల పవన్ కుమార్ జన సైనికులు పాల్గొన్నారు.