విజయవాడ ( జనస్వరం ) : ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం రెండో విడతలో భాగంగా ఈరోజు 55వ డివిజన్లోని వించిపేట సిఎస్ఐ చర్చి వద్ద నుండి ప్రారంభించి కొండ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ముఖ్యంగా చర్చి సెంటర్ వద్దనుండి కొండ ప్రాంతంలో ఇంటింటికి పర్యటిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మాకు సమస్యలే చెప్పుకొస్తున్నారని ముఖ్యంగా ఇక్కడ వున్నటువంటి టిఎస్పి వీధికి ర్యాంపు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్తున్నారని ఇక్కడ ర్యాంపు లేకపోవడం వలన అనారోగ్యం చెందిన వారిని, గర్భిణీ స్త్రీలను హాస్పటల్ కు తీసుకెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని ఇక్కడ ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ కు రక్షణ లేదని ఇక్కడ గంజాయి బ్యాచ్ విచ్చలవిడిగా సంచరిస్తూ, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎవరైనా వాటర్ ట్యాంకు దగ్గరకి రావడానికి సాహసించ లేని పరిస్థితి అని ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ కి వాచ్మెన్ మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయక పట్టేసి త్రాగునీరు కలుషితం అవుతుందని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ని క్లీనింగ్ చేసి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కోరుతున్నారని అదే విధంగా ఈ కొండ దిగువున వున్న కనకదుర్గ గుడి దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్ తుప్పు పట్టేసి ప్రమాద స్థితిలో ఉందని వర్షం కురిసిన సమయంలో పక్కన వున్న ఇళ్ళకి షాక్ కొడుతుందని దీనిపై స్థానిక కార్పొరేటర్ కి చెప్పుకున్న కనీసం స్పందించలేదని ప్రజా సమస్యల మీద స్పందించలేనటువంటి కార్పొరేటర్ ఉండి దేనికని అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అయినటువంటి బుల్లా విజయ్ కుమార్ గారి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అమ్మవారి గుడి వద్ద మురుగునీరు బయటికి వచ్చి గుడి పరిసర ప్రాంతాలను అపరిశుభ్రం చేస్తూ ఉంటే కనీసం కార్పొరేషన్ కార్మికులు చెప్పి చర్యలు తీసుకోలేకపోతున్నారంటే మీరు కార్పొరేటర్ గా గెలిచి దేనికని స్థానిక ప్రాంతంలో ఉండే చిన్న సమస్యలనే పరిష్కారం చేయలేని పరిస్థితిలో స్థానిక కార్పొరేటర్ ఉన్నారని అదేవిధంగా ఈ పర్యటనలో చాలామంది మహిళలు మా యొక్క పెన్షన్ తీసేసారని ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి మాకు ఇంత వరకు ఎక్కడ ఇళ్ళు ఇస్తారో చూపించ లేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని ఆధార్ కార్డులో వయసును ప్రామాణికంగా తీసుకుని మా యొక్క పథకాలు తొలగిస్తున్నారని వైసిపి ప్రభుత్వంలో పథకాలు ఎవరికి అందట్లేదు అని కేవలం వారు పథకాలు ఇస్తున్నాము అని ప్రచారం చేసుకుంటున్నారు అనీ వైసిపి ప్రభుత్వంలో అవినీతి బాగా అభివృద్ధి జరిగిందనీ వైసీపీ ప్రభుత్వంలో కేవలం వైసిపి నాయకులు ఆర్థికంగా అభివృద్ధి చెందారే తప్ప ప్రాంతాలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్, మొబీనా, అల్లం నాగ రమేష్,t భరత్, మల్లెపు విజయలక్ష్మి ఏలూరు సాయి శరత్ , పొట్నూరి శ్రీనివాసరావు, రెడ్డిపల్లి గంగాధర్, స్టాలిన్ శంకర్, బుట్టా సాయి, సావింగ్కార్ నరేష్, తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com