
చిత్తూరు ( జనస్వరం ) : అణగతొక్కే కొద్ది పైకి లేచేదే జనసైన్యం అని జనసేన చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏ. పి. శివయ్య అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏమి చేయలేక పార్టీ కేడర్ ను అరెస్టుల పేర్లతో ప్రభుత్వం అణగా తొక్కలని చూస్తుందని ఏ. పి. శివయ్య ఓ పత్రిక ప్రకటనలో వెల్లడిచారు. జనసేన నేతలను, కార్యకర్తలను కానీ ఈ అధికార పార్టీ, ప్రభుత్వం ఎంత అణగా తొక్కాలానీ చూస్తే అంత పైకి ఏదుగుతారు అని అయన అన్నారు. ఇటీవల జరిగిన సంఘటనల వరుస క్రమం చూస్తూ ఉంటే అధినేత పవన్ కళ్యాణ్ ను, జనసేన పార్టీని నాశనం చేయాలని అధికార పార్టీ చూస్తున్నదని అభిప్రాయపడ్డాడు. అయితే జనసేన పార్టీ దినదినభివృద్ధి చెందతుందని, ప్రధాని నరేంద్రమోడీగారి స్థాయి వ్యక్తుల ప్రతేక్య గుర్తుంపు చూసి అధికారపార్టీ వెన్నులో వణుకుపుడుతుంది అన్నారు. అందుకే ఆందోళనలో ఏమి చేస్తున్నారో తెలియక అధికారాన్ని చేజార్చుకునేందుకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ఇటువంటి దుశ్చర్యలలో భాగంగానే చిత్తూరు జిల్లాలో డాక్టర్ యుగంధర్ పొన్న, కిరణ్ రాయల్ వంటి నేతల అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు.