Logo
Date of Publish : 14 November 2022, 10:23 am
Editor : Sake Naresh

అనువుకానీ చోట జగనన్న ఇల్లు ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం : సి.జి రాజశేఖర్

        జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా మూడవరోజు వెల్దుర్తి మండలంలో పర్యటించడం జరిగింది. తదనంతరం జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ, వెల్దుర్తి గ్రామానికి సంబంధించిన వారికి, వెల్దుర్తి నుంచి బ్రహ్మగుండం దగ్గరగా అంటే సుమారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో 350 దాక పట్టాలిచ్చారు, కానీ ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి, ఎలాంటి ప్రయోజనం లేని చోట స్థలాలు ఇవ్వడం వల్ల, ఇంతవరకు అక్కడ పునాది కూడా వేయలేకపోతున్నారన్నారు. ఇల్లు ఎవరైనా గాని నిర్మించుకుంటే, తరతరాలకు నిలిచిపోయే విధంగా ఇల్లు నిర్మించుకుంటారు, కానీ ఇక్కడ ఆ ప్లేస్ ని చూసిన తర్వాత మాకు ఆశ్చర్యం కలిగించింది. నమ్మలేని విషయాలు చూశాం, కొండలు, గుట్టలు, పెద్ద పెద్ద బండ రాళ్లు, ఇల్లు స్థలాలు కేటాయించడం వల్ల ఇక్కడ ఎవరూ కూడా ఇల్లు నిర్మించుకోలేదని మాకు తెలియజేశారు. ఇక్కడ ఇల్లు నిర్మించుకున్న తర్వాత బాత్రూంలకు వాటర్ సంపులు నిర్మించుకోవడానికి కూడా, రెండు ఇంచులు కూడా గుంతలు తీయలేని పరిస్థితి ఇప్పుడు చూశాం. ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ,ఈ ప్లేసు సౌకర్యమైన ప్లేస్ కాదని, ఈ ప్లేస్ బదులుగా వేరేచోట ఎక్కడైనా మంచి ప్లేస్ తీసుకొని వెల్దుర్తి గ్రామ ప్రజలకు మంచి సౌకర్యంతో కూడిన ఇల్లు నిర్మించాలని, జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, నాయకల్ బాబ్జి, శివరాజు, కటార్ కొండ భాస్కర్, నాగేశ్వరరావు, చిరంజీవి, మధుసూదన్, మాలిక్ భాష, జీవన్ కుమార్, రాముడు, ఆంజనేయులు, మరియు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com