
గాజువాక ( జనస్వరం ) : జనం వద్దకు జనసేన అనే నినాదంతో గాజువాక నియోజకవర్గంలో PAC సభ్యులు, నియోజకవర్గం ఇంచార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో సాగుతున్న పాదయాత్ర ఈ రోజు 70వార్డులో డ్రైవర్స్ కాలని, LBS nagar, దశమికొండ కాలనీ, శ్రీనివాస్ నగర్, ఎర్రగడ్డ కాలనీ, TVN కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగింది. 70వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు లంకల మురళీ దేవి గారు సారాధ్యంలో భారీ సంఖ్యలో హాజరైన మహిళలు, జనసైనికులు, పార్టి శ్రేణులతో పాదయాత్ర కొనసాగింది. ఎక్కడ చుసినా పాడైన రోడ్లు, త్రాగునీరు కొరత, వీధి లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు, వైసిపి ప్రభుత్వం భారీగా పెంచిన ఇంటి పన్నులు, విద్యుత్ చార్జీలు కట్టలేక ప్రజలు సతమతమవుతున్నారని, ఉపాధిలేక నిరుద్యోగంతో యువత భవిష్యత్తు నిర్వీర్యం ఐయ్యిందని, దారి పొడవన సమస్యలపై నియోజకవర్గం ఇంచార్జి కోన తాతారావుకు వినతలిచ్చిన స్థానిక ప్రజలు. కోన తాతారావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వానికి గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని, జనసేన, టిడిపి ల సారథ్యంలో ప్రభుత్వం రావాలనే ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నా తరుణంలో త్వరలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆదరించాలని కోరారు. ప్రజలు ఆదరిస్తే జవాబుదారి తనంతో సమస్యలు పరిష్కారం చేస్తామని, కొత్త పరిశ్రమలు తేవటం ద్వారా నిరుద్యోగంతో అల్లాడుతున్న యువతను ఆడుకుంటామని కోన తాతారావు అన్నారు. అన్నివేళలా ప్రజల మద్యనే ఉండాలని పార్టి శ్రేణులకు సూచించారు. ఈ పాదయాత్రలో పార్టీ నాయుకులు గడసాల అప్పారావు, దల్లి గోవింద రెడ్డి, తిప్పల రమణారెడ్డి, స్థానిక నాయుకులు కురిటి సూరిబాబు, తుంపాల చిరంజీవి, కర్రి శ్రీకాంత్, వార్డుల అధ్యక్షులు చైతన్య, కనకారావు, సోమశేఖర్, సంద్రాన భాస్కర్, మాక షాలిని, పోల రౌతు వెంకట రమణ, గంధం వెంకటరావు, బలిరెడ్డి నాగేశ్వరావు, దుల్ల రామునాయుడు, పత్తి రామలక్ష్మి, బద్ది కనక దుర్గ, పల్లా కనకరాజు, రౌతు గోవింద్, మాకా షాలిని, లంక లతా, జ్యోతి రెడ్డి, కొల్లి శివాజీ, గళ్ళ ఈశ్వర్ సాయి, కోలా ప్రసాద్, సురేష్, నవీన్, సాడె రామారావు, రౌతు భాస్కర్, మేడిసెట్టి విజయ్, చందక చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.