నెల్లూరు సిటీలోని వెంకటేశ్వరపురం దగ్గర జనార్ధన్ రెడ్డి కాలనీలో గతంలో పేదల టిడ్కో ఇళ్ల కోసం కేటాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా, ప్రజా సంపదను ఆక్రమిస్తూ కట్టిన వైసిపి భవనాలను వెంటనే ప్రభుత్వానికి అప్పజెప్పాలి అంటూ జనసేన పార్టీ జాతీయ మూడియా ప్రతినిది వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి పాలన వారు ఆడిందే ఆట , పాడిందే పాట , చెప్పిందే న్యాయం, చేసిందే చట్టంగా వ్యవహరించారు. పేదలకు ఆరు అంకణాలు స్థలాలు ఇచ్చేదానికి 66 సార్లు ఆలోచించి , చివరకి అది కూడా ఇవ్వకుండా వైసిపి నాయకులు వ్యక్తిగతంగా దోచేసిన భూములే కాకూండా , ఇప్పుడు ఏకంగా వైసిపి పార్టీ భవనాల పేరుతో కూడా పేదల భూములను దురాక్రమణ చేసారు.
రాజులను , రాజరికాలను , సామంత రాజులను మరపించే విధంగా రాజద్రోహం కేసులు , రాచరిక అలవాటులను తిరిగి గుర్తుచేసిన వైసీపీ పతనమైంది. పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో భూములు అయితే ఏమి , ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములు అయితే ఏమి , ఎక్కడపడితే అక్కడ , ఎలాపడితే అలా అన్యాయంగా ఆక్రమించి ఆర్భాటంగా వైసిపి పార్టీ భవనాలను నిర్మించడం హేయమని చర్య. ఆ రోజున ఈ దుష్ట వైసీపీ నాయకులకు సహరించిన అధికారులు అందరూ కూడా ఈ దుర్మార్గానికి బాధ్యులే. మరొకసారి ఈ విధమైన చర్యలు జరగకుండా , ఎవరు కూడా ఇలాంటి నీచులకు సహకరించడానికి భయపడేటట్లు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుని , శిక్షలు పడేటట్లు చూడాలి .
ఈ వైసీపీ భవన నిర్మాణ బాధ్యతలని జగన్ కి అత్యంత ఆప్తుడైన రాంకీ ఇన్ఫ్రా అనే సంస్థకి అప్పజెప్పడం, ఈ నిర్మాణాలకు బదులుగా రాంకీ ఇన్ఫ్రా వాళ్ళకి అనకాపల్లిలో జగన్ 50 ఎకరాలు కట్టబెట్టి అందులో పది ఎకరాలకు మాత్రమే డబ్బు కట్టించడం చూస్తుంటే మాకు పూర్వపు రోజులు గుర్తొస్తున్నాయి, వస్తు మార్పిడి పద్ధతి అనేది పూర్వపు రోజుల్లో అలవాటులో ఉండేది , అవన్నీ మర్చిపోయిన రోజుల్లో పాత పద్ధతులను జగన్ గుర్తుచేస్తున్నాడు. 26 జిల్లాల్లో కలిపి దాదాపుగా 42.24 ఎకరాలు కేటాయించగా, వాటి విలువ రూ.688 కోట్లు ఉంటుందని అంచనా.వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి న్యాయమైన చర్యలు తీసుకొని జగన్ చెప్పినట్లుగా అక్రమ కట్టడాలను ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా , మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,జనసేన సీనియర్ నాయకులు, నూనె మల్లికార్జున యాదవ్, రవి, కారంపూడి కృష్ణ రెడ్డి, శ్రీరామ్, చిరంజీవి యువత అధ్యక్షులు సురేష్, కృష్ణ పెన్నా రిజినల్ కో ఆర్డినేటర్ నగరత్నం యాదవ్, గుర్రం కిషోర్, సుధా మాధవ్, కోవూరు నాయకులు హరిరెడ్డి,భక్తవత్సల్ నాయుడు, శ్రీ కాంత్, పవన్,హేమచంద్ర యాదవ్,ప్రశాంత్ గౌడ్, మౌనిష్,శరవణ, శ్రీను, ఇసాక్, బాలు, చిన్న రాజా. వీరమహిళలు ఇందిరా, భారతి, హసీనా, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు…
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com