Logo
Date of Publish : 21 December 2025, 8:48 pm
Editor : Sake Naresh

రాచానపల్లిలో ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు

- పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి

అనంతపురం రూరల్, డిసెంబర్ 21 (జనస్వరం) : అభివృద్ధి, సంక్షేమం, విద్య ,వైద్య రంగాలకు అభివృద్ధి ప్రదాత వైఎస్ఆర్సిపి అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బ్రదర్ తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం వైసీపీ నాయకులు మన్నల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రాచానపల్లి గ్రామంలోని విన్సెంట్ ఫెర్రర్ కాలనీ నందు వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు కేకును సర్పంచ్ అంజియాదవ్, బానుకోట శివ, జడ్పిటిసి చంద్రకుమార్, ఉపసర్పంచ్ మన్నల వరలక్ష్మి తో కలిసి కట్ చేశారు. వైయస్ఆర్సీపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ, విద్య, వైద్య రంగాలకు దివంగత వైయస్సార్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తి ప్రదాతలు అన్నారు. రాజకీయాలు ఉన్నంతవరకు వైయస్సార్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. వైఎస్ఆర్సిపి శ్రేణులు సమిష్టి కృషితో జగనన్న ముఖ్యమంత్రిగా అయ్యేందుకు కృషి చేయాలి అన్నారు. పార్టీ శ్రేణులు అందరూ ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. పేదలకు విద్య, వైద్యం శాశ్వతంగా దూరం చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రమంతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతను నాయకులు గమనించకుండా మొండి వైఖరిగా ముందుకు సాగడం బాధాకరమన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల శాశ్వతంగా పేదలకు విద్య, వైద్యం దూరం అవటమే కాకుండా ఖరీదైన వస్తువుగా అవుతుందన్నారు. పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలతో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. రాచానపల్లి గ్రామానికి విచ్చేసిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నాగేంద్ర, రామకృష్ణయ్య, నల్ల స్వామి, శ్రీకాంత్, మధు, తదితర వైసీపీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com