Logo
Date of Publish : 27 January 2022, 4:07 pm
Editor : Sake Naresh

ఉద్యోగులను నిండా ముంచిన వైయస్ జగన్ : కువైట్ జనసేన నాయకులు

  కువైట్, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాడు ఉద్యోగులను, ఉపాధ్యాయులను, కార్మికులను రకరకాల ప్రలోభాలకు గురి చేసి, అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, నేడు వారిని ఆర్ధికంగా నష్టపరచి ఆత్మక్షోభకు గురిచేసిందని జనసేన ఎన్ ర్ ఐ సేవా సమితి(కువైట్) మరియు గల్ఫ్ సేన-జనసేన సభ్యులు కంచన శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంపు అనేది ఉద్యోగికి సర్వసాధారణం. జగన్ రెడ్డి ప్రభుత్వం తన రాజకీయ చతురతను ఉద్యోగుల జీతాల విషయంలో ప్రదర్శించడం బాధాకరం.పీఆర్సీ అమలు చేస్తే కనీసం వెయ్యి రూపాయలు పెరగక పోగా,ప్రతి ఉద్యోగి కూడా రెండు వేల నుండి పది వేల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది. ఉద్యోగులు ఎంతో పోరాడి సాధించుకున్న హెచ్ఆర్ఏ స్లాబులు 12, 14.5, 20, 30 లను 8, 16 కు తగ్గించి వారిని మనో వేదనకు గురి చేయడం తగదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సిపిఎస్ ను మూడు సంవత్సరాలైనా పట్టించుకోక పోవడం ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలిపారు. ఉద్యోగుల తరపున మేము పోరాటాలకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. అర్ధరాత్రి పూట అడ్డుగోలు జీవోలను రద్దు చేసి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన వేతన సవరణ జరగాలని డిమాండ్ చేస్తున్నామని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కంచన శ్రీకాంత్, దండు శేఖర్, దండు వేణు, అల్లం ప్రేమ్ రాయల్, దండు సురేష్, కొమ్మినేని బాలాజీ, చలపతి, వెంకటేష్ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com