ఆముదాలవలస ( జనస్వరం ) : దళిత, ప్రజాసంఘాలు పోరాట పోరాట ఫలితంగా సాధించుకున్న 28 పథకాలను అమలు చేయకుండా నిలుపుదల చేయడాన్ని దళిత సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశంలో మండిపడ్డాయి. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మట్ట పురుషోత్తం జనసేన పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడరామ్మోహన్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు బాలకృష్ణ ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్చార్జి కె రామారావు, జనసేన పార్టీ సరుబుజ్జిలి మండలం అధ్యక్షుడు పైడి మురళీమోహన్, కరుణాసాగర్, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్ ,కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, రెల్లికులసంక్షేమ సంఘం జిల్లా నాయకులు అర్జీ ఈశ్వరరావు, పైడికులసంక్షేమ సంఘం జిల్లా నాయకులు లిమ్మల అనంతరావు ,అంబేద్కర్ జాతర నిర్వహణ కమిటీ కన్వీనర్ టొoపల రమణ ,అంబేద్కర్ జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, అలికాన లక్ష్మణరావు , బలగ గణపతి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దళిత ఆదివాసి అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని వారికి ఇస్తున్నటువంటి రుణాలు గాని సబ్సిడీ గాని ఒంటి పథకాలను అమలు చేయకుండా ఆ పథకాలకు నిధులు కేటాయించకుండా దళితులు పట్ల వాళ్ళ అభివృద్ధి పట్ల దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తుందని వాపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల అభివృద్ధి కట్టుబడి ఉన్నానని గొప్పలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారని ఎన్నికల్లో దళిత ఆదివాసీలుదగా మోసం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com