
పిఠాపురం, (జనస్వరం) : పిఠాపురం నియోజకవర్గములో జనసేనపార్టీ ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో పిఠాపురం పట్టణం 10వ వార్డుపుణ్యమాంతుల సూర్యనారాయణ మూర్తి గారి పట్టణ జనసైనికుల నేతృత్వంలో కొంతమంది యువకులుకి జనసేన పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆదర్శాలుకు అనుకూలంగా మేము సైతం అని మీ బాటలో అడుగు వేస్తాము అని పదో వార్డ్ యువకులు ముందుకు రావడం జరిగింది. ఇలాగే మన జనసైనికులు ప్రతి ఒక్కరు పనిచేసి జనసేన పార్టీకి బలంగా నిలబడాలని జిల్లా అధ్యక్షులు సమక్షంలో డిసెంబర్ ఐదో తారీఖున మన పట్టణంలో ఉన్న కార్యాలయం ప్రారంభించి ఆరోజున పార్టీలోకి జాయినింగ్ భారీ స్థాయిలో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు 31వ తారీఖున శ్రీ పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభకు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రసంగిస్తారు. కావున ప్రతి జనసైనికులు నాయకులు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాటి మధుబాబు, పుణ్యమాంతుల సూర్యనారాయణ మూర్తి, వేల్పుల చక్రధర్, బొజ్జ కుమార్, గరగా బాబీ, బుర్ర సూర్య ప్రకాష్, లంక పురుషోత్తమరావు, మైనంబత్తుల చిన్న, సీకోటి రాజశేఖర్, పసుపులేటి గణేష్, పి చిన్న, దాకే ప్రసాద్, రాయి వెంకటరమణ, లంకా ప్రసన్న కుమార్, మాకన లారా జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.