Logo
Date of Publish : 28 December 2023, 9:35 pm
Editor : Sake Naresh

యువత శక్తివంతంగా ఎదగాలి : మలిశెట్టి వెంకటరమణ

     రాజంపేట ( జనస్వరం ) : యువత క్రీడారంగం, రాజకీయ రంగమే కాక అన్ని రంగాలలోనూ రాణించి శక్తివంతంగా ఎదిగి దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ అన్నారు. గురువారం వీరబల్లి మండలానికి చెందిన ఈడిగ పల్లె, వడ్డి పల్లె గ్రామాల యువకుల కోరిక మేరకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి గ్రామాలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు సాధన కోసం మలిశెట్టి వెంకటరమణ ఇరుజట్ల కెప్టెన్లకు ఒక్కొక్కరికి రూ 10 వేలు చొప్పున రూ 20 వేలు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఇండేన్ గ్యాస్ వద్ద గల తమ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, చదువు పట్ల మక్కువ పెంచుకొని, ప్రతి దినము వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా, సౌష్టవంగా ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికలవేళ నేతలు వెదజల్లే డబ్బులు కోసం ఆశ పడకుండా రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతి వంటి అభివృద్ధి పనుల కోసం అధికారులను, నేతలను నిలదీయాలని అన్నారు. గ్రామ గ్రామాన ఇందుకోసం యువత నడుం బిగించాలని, అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని తెలిపారు. రానున్న ఎన్నికలలో టిడిపి, జనసేన కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, శ్రీనివాసులు, చౌడయ్య, కొత్తూరు వీరయ్య ఆచారి,కత్తి సుబ్బరాయుడు, పోలిశెట్టి రజిత, శిరీష, వీరబల్లి మండలం వడ్డీ పల్లె క్రికెట్ జట్టు కెప్టెన్ బాలచంద్ర, ఈడిగపల్లె జట్టు కెప్టెన్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com