సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో యూత్ లీడర్ లిఖిత్ అండ్ టీమ్ తోపాటు 30 కుటుంబాలు జనసేనలోకి చేరారు. సురేష్ నాయుడు మాట్లాడుతూ యువత చూపు జనసేన వైపు ఉందని, రాబోయే రోజుల్లో యువత రాజకీయాల్లో బలంగా నిలబడాలని వారికి ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుంది. మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ కూడా యువతకి అండగా నిలబడిన పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎన్నికల సమయంలో వాటర్ ప్యాకెట్, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి జెండాలు ముగించుకున్నారే తప్ప వాళ్ళకి రక్షణగా నిలబడిన పరిస్థితులు లేవని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన జెండా మోసే ప్రతి కార్యకర్తకి అండగా క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకొచ్చి వారికి వారి కుటుంబానికి ఒక రక్షణ కవచం లాగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం ఉపయోగపడుతుందని అన్నారు. దీనివల్ల యాక్సిడెంట్ అయ్యి వైద్య నిమిత్తం హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు 50వేల రూపాయలు వరకు ఉపయోగించుకోవచ్చు, ప్రాణాపాయ పరిస్థితి అయితే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించే విధంగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో యువత బాగుంటే, రాష్ట్రం బాగుంటది కాబట్టి యువతని సాధనంగా ఆహ్వానిస్తున్న వారికి ఎప్పుడూ కూడా అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ మహిళా నాయకురాలు గుమ్మినేనివాణి భవాని, స్థానిక నాయకులు రహీం, అక్బర్, మస్తాన్, అశోక్, పవన్, గిరీష్, మండల కార్యదర్శి శ్రీహరి, వంశీ తదితరులు పాల్గొన్నారు.