
– జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్
సూళ్లూరుపేట, (జనస్వరం) : సత్యవేడు నియోజకవర్గం జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్ సంతవేలూరు గ్రామం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరై టాస్ వేసి మొదటి మ్యాచ్ ని ప్రారంభించారు. అనంతరం తమను ఆహ్వానించిన సత్యవేడు నియోజకవర్గ జనసైనికులకి నాయకులకి దన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పక్క దోవ పట్టకుండా విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమేనన్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో క్రీడలకు ప్రోత్సాహం కల్పించడమే కాక గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించి, కోచ్ లను నియమించి వారిని మెరుగు పరిచి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చి దిద్దే విధంగా కృషిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి జనసేన నాయకులు ఆవల రమణ, వల్లూరు కిరణ్, శ్రీహరికోట జగదీశ్, వల్లూరు రాజా, కోటి, బొల్లకాయల కిరణ్, కుంపటి శ్రీనివాస్, బచ్చు బాల సుబ్రమణ్యం, కళ్యాణ్, అఫ్రిడ్ తదితరులు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గం వరదాయపాలెం మండల్ ప్రెసిడెంట్ అంబటి చిరంజీవి పాల్గొన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్న సత్యవేడు నియోజకవర్గం జనసైనికులు పవన్, గౌతమ్, కుమార్, శ్రవణ్, పవన్ కళ్యాణ్ ప్లేయర్స్ అందరిని సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరపున అభినందించారు.