గొల్లప్రోలు, అక్టోబర్ 12, (జనస్వరం) : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలంటే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని డిసిసిబి చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో నిర్వహించిన గొల్లప్రోలు లీగ్–4 క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరుజట్ల క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ మాట్లాడిన తుమ్మల బాబు, యువత క్రీడలను జీవితంలో భాగంగా మలచుకుంటే శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని తెలిపారు. క్రీడల వల్ల క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, ఇవే భవిష్యత్‌లో ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో విజయం సాధించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
అదేవిధంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి పెట్టితే కుటుంబానికి, సమాజానికి గర్వకారణంగా నిలుస్తారని తుమ్మల బాబు అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యుడు కొణిదెల పవన్ కళ్యాణ్‌కు ఇటీవల గోల్డెన్ డ్రాగన్ సంస్థ ‘టైగర్ ఆఫ్ మాస్టల్ హార్ట్స్’ అనే బిరుదును అందించడాన్ని ప్రస్తావిస్తూ, దానిని స్ఫూర్తిగా తీసుకుని పిఠాపురం నియోజకవర్గ యువకులు కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు లీగ్ కిరణ్, జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు, బసవ చిట్టిబాబు, మర్రి దొరబాబు, బాల్రెడ్డి గంగబాబు, కేశరపు సుబ్బు, మొగలి రాజా నాయుడు, మొగలి రాజా హీరో, తలారి శ్రీనివాస్, అన్నం దొర పట్టాభిరామయ్య, గరగ తాతాజీతో పాటు గొల్లప్రోలు పట్టణానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
