Logo
Date of Publish : 13 January 2026, 10:49 am
Editor : Sake Naresh

యువత మేలుకో – మార్చుకో నీ భవిత

అనంతపురం, జనవరి 12, (జనస్వరం) : సమాజంలో సానుకూల మార్పుకు యువతే ప్రధాన శక్తిగా ముందుకు రావాలని డా. దాసగానపల్లి కుళ్లాయప్ప పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి అడుగుపెడితేనే సమాజం నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, అప్పుడు పాలనా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకూ యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని, ఇంటింటా రాజకీయ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓటు వేయడమే సరిపోదని, మార్పుకు దిశానిర్దేశం చేసే నాయకత్వం వహించాల్సిన బాధ్యత యువతదేనని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకాలని, ఆయన భావజాలాన్ని అనుసరించి ముందుకు సాగితేనే దేశ భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని అన్నారు. యువతే దేశానికి వెన్నెముక అని, మార్పు మీ చేతుల్లోనే ఉందని ఆయన ఉద్ఘాటించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com