
ధర్మవరం, (జనస్వరం) : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిగా నీకు అర్హత లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్వగృహములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి వాళ్ళ పల్లకి మోస్తున్నారని చెప్పడం సరి అయింది కాదని వారి విమర్శలపై ఆయన ఘాటుగా మండిపడ్డారు. నాతో డీ కొట్టడానికి టిడిపి జనసేన ఇతర పార్టీలన్నీ కలిసికట్టుగా రావాలంటూ కేతిరెడ్డి పేర్కొన్నారని, ఆయన ఢీకొట్టడానికి అన్ని పార్టీలు ఎందుకు? ఒక్క జనసేన పార్టీ చాలు అని సవాల్ విసిరారు. కాపులను, బలిజలను కించపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని వారు హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఇంటికి పంపాలో ప్రజలకు తెలుసునని, మీ అరాచకాలు, దౌర్జన్యాలు, పరిపాలనతో ప్రజలు విసుగు చెందారన్న విషయం ఇప్పటికే బట్టబయలు అయిందని తెలిపారు. పట్టణములో తాను నిర్వహిస్తున్న సేవ్ ధర్మవరం కార్యక్రమంలో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటున్నానని, ప్రజల నుండి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కూడా కనపడుతోందని తెలిపారు. మీ బెదిరింపులకు భయపడేది లేదని, భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు కు ఎమ్మెల్యే గురవుతారని జోష్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సిబిఐ కేసులు, మా పవన్ కళ్యాణ్ కు లేవని, నీతి నిజాయితీ ఉండే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అని తెలిపారు. 2024 లో జరిగే ఎన్నికల్లో కాపులు తదితర వర్గాల వారు నీకు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, ప్రభుత్వంలోని పలు విభాగాల ఉద్యోగస్తులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న, పట్టించుకున్న పాపాన పోలేదని వారు మండిపడ్డారు. కేతిరెడ్డి నీకు ఆరోగ్యం బాగాలేక గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పేరుతో ఊరంతా తిరుగుతున్నావు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి రాబోయే రోజులు మంచి రోజులు కావని వారు హితవు పలికారు.