Logo
Date of Publish : 13 November 2025, 2:17 pm
Editor : Sake Naresh

ఈ నెల 14 వ తేదీ నుండి సదరం స్లాట్ బుకింగ్ ఓపెన్

అమరావతి, అక్టోబర్ 13, (జనస్వరం) : రాష్ట్రంలో వికలాంగుల నిర్దారణ కోసం సదరం స్లాట్ బుకింగ్ ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమవుతుందని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రదర్ ఐఏఎస్ ప్రకటించారు. నవంబర్, డిసెంబర్ 2025 నెలలకు సంబంధించిన స్లాట్లను ప్రజలు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డ్ సచివాలయాల్లో బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ధ్రువీకరణ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారం శారీరక, మానసిక, బధిరులు, దృష్టి వైకల్యం ఉన్నవారికి సదరం సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఎరియా ఆసుపత్రుల్లో మంగళవారం శారీరక మరియు దృష్టి వైకల్యం కలిగినవారికి నిర్ధారణ సేవలు అందించనున్నట్లు తెలిపారు.

సోమవారం రోజున సి.హెచ్.సిల్లో శారీరక వైకల్యం ఉన్నవారికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు స్లాట్ బుకింగ్ సదుపాయం కల్పించబడిందని చక్రదర్ పేర్కొన్నారు. ప్రజలు నిర్ణీత సమయాల్లో స్లాట్లు బుక్ చేసుకుని ఆసుపత్రులను సందర్శించాలని ఆయన సూచించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com