తిరుపతి ( జనస్వరం ) : స్వాతంత్ర సమరంలో దేశం కోసం అక్షర పోరాటం చేసిన ఆంధ్రప్రభ అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకొని అందరి అభిమాన పత్రికగా వెలుగొందుతోందని రాష్ట్ర పీఏసీ మెంబర్,జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అభిప్రాయపడ్డారు. శనివారం తిరుపతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పసుపులేటి హరిప్రసాద్ జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి ఆంధ్రప్రభ 2024 నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పసుపులేటి హరిప్రసాద్ ఆంధ్ర్‌ప్రభతో ప్రత్యేకంగా మాట్లాడుతూ విలువలు లేని జర్నలిజం నడుస్తున్న నేటి రోజుల్లో పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు అన్న తారతమ్యం లేకుండా విలువలు విశ్వసనీయతతో కూడిన వార్తా కథనాలను ప్రచురిస్తూ పాఠకులలో గొప్ప నమ్మకాన్ని పెంపొందించుకున్న ఆంధ్రప్రభ దినదినాభివృద్ధి చెందడం ఆనందదాయకంగా ఉందన్నారు. ప్రధాన పత్రికలతో పోటీ పడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళుతూ ప్రజల పక్షంగా నిలుస్తున్న ఆంధ్రప్రభ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అవినీతి అక్రమాలపై సమరశంఖం మోగిస్తూ నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న ఆంధ్రప్రభ భవిష్యత్తులో మరింత గొప్పగా వర్ధిల్లుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాచార వ్యవస్థను మరింతగా పాఠకుల చెంతకు చేరుస్తూ ప్రతి ఒక్కరినీ మేల్కొలిపే విధంగా ఆంధ్రప్రభ యాబ్, వెబ్, స్మార్ట్ ఎడిషన్‌ను డిజిటల్ రూపంలో తీసుకురావడం శుభ పరిణామమన్నారు. అనంతరం ఆంధ్రప్రభ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్‌ఛార్జి అద్దూరు రవి ఆంధ్రప్రభ సర్క్యులేషన్ విభాగం రీజనల్ మేనేజర్ నవీన్, తిరుపతి హెల్త్ విభాగం రిపోర్టర్ శ్రీనివాసులుతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ఆంధ్రప్రభ క్యాలెండర్ అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తిరుపతి నగర కార్యదర్శి హేమంత్ కుమార్, వంశీ, జనసేన సీనియర్ నాయకులు చంద్రశేఖర్, సుబ్బు, నాగరాజ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com