Logo
Date of Publish : 19 December 2022, 3:54 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి ధాటికి వైసీపీ గాడిదలు మూలుగుతున్నాయి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

        నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 217వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ పాలబూత్ సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సాయం చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుని తన స్వంత నిధులతో 3వేల కుటుంబాలకు తలా లక్ష రూపాయల సాయం చేస్తున్నారని అన్నారు. ఇది ఓర్వలేని వైసీపీ మంత్రులు, నాయకులు పవన్ కళ్యాణ్ గారిపై పడి ఏడుస్తున్నారని, నిన్నటి సభలో పవన్ కళ్యాణ్ గారు గాడిదలు అనగానే గాడిదల కంటే ముందు వైసీపీలోని వారే తమను తాము గాడిదలుగా భావించుకుని ఓండ్ర పెడుతూ మూలుగుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి రథం పై త్వరలో చేపట్టనున్న యాత్ర గురించి వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటినుండే గుబులు మొదలైందని, ఏది ఏమైనా గాని పవనన్నని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com